

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ పాట ఐదు భాషల్లో విడుదలై 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టింది. ఉత్సాహభరితమైన బీట్, సెలబ్రేటరీ వైబ్, రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాటకు 2 మిలియన్లకు పైగా లైక్స్, 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ పాట హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ 3 లక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, 8.7 లక్షల యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అయ్యాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ మార్చి 27న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!