
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, ఈ సినిమా మరియు రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ అద్భుతమైన నటుడని ఆయన ప్రశంసించారు. అలాగే పెద్ది కేవలం స్పోర్ట్స్ మూవీ మాత్రమే కాదని, ఇందులో బలమైన దేశభక్తి అంశాలతో పాటు అద్భుతమైన స్పోర్ట్స్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని ఆయన పేర్కొన్నారు.
మే 18న విడుదలైన పెద్ది ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ పాత్ర హీరో ఎలివేషన్‌కు కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!