
జనరల్

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పెద్ది సినిమా ఓ మనిషి గుర్తింపు కోసం చేసే పోరాటం కథ అని ఆయన తెలిపారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్, గత రెండేళ్లుగా ఈ సినిమాకోసం అహర్నిశలు కష్టపడ్డామని చెప్పారు.
ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన బలమని రామ్ చరణ్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ డ్యాన్స్, అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘దంగల్’, ‘సుల్తాన్’ వంటి చిత్రాలు ఈ మూవీకి ప్రేరణగా నిలిచాయని చెప్పారు. మరోవైపు బుచ్చిబాబు మాట్లాడుతూ, చరణ్ ఈ పాత్ర కోసం క్రికెటర్ నుంచి రెజ్లర్ వరకు విభిన్న శారీరక మార్పులు సాధించారని తెలిపారు. జాన్వీ సరదాగా బుచ్చిబాబును “రౌడీ డైరెక్టర్” అంటూ నవ్వులు పూయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!