
క్రీడలు

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్ ప్రవేశించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. జూన్ 11న తన భవిష్యత్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడిస్తానని గతంలో ప్రకటించిన లారెన్స్, తాజాగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జూన్ 12న ఉదయం 10 గంటలకు తన ప్రకటనను వెల్లడించనున్నట్లు చెప్పారు.
ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయిందన్నారు. ఆయనను కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నానని, ఈ లోటు తనను ఎంతో కలిచివేసిందని పేర్కొన్నారు. భారతీరాజాపై ఉన్న గౌరవంతో పాటు భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా తన ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!