

యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఘన విజయం తర్వాత నిహారిక మరో ఆసక్తికర ప్రాజెక్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా, సినిమాను ఏప్రిల్ 3 న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ కామెడీ మూవీలో సంగీత్ శోభన్ సోలో హీరోగా తొలిసారి నటిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా, సమ్మర్ స్పెషల్గా విడుదల కానున్న ‘రాకాస’ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!