
గాసిప్స్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్ సిద్ధమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పూరి సేతుపతి’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.
ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్లా నిర్మిస్తుండగా, చార్మీ అధికారికంగా ప్రెజెంట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సంయుక్త, టబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!