

జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఏ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు పూర్వాజ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు కొందరు దర్శకులు తమ చిత్రంపై నమ్మకంతో సవాళ్లు విసురుతుంటారని, అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలిపారు. ‘కిల్లర్’ సినిమాలో ఇంటర్వెల్ సమయంలో, ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్‌ను ఎవరైనా ముందుగానే గుర్తించి, 15 నిమిషాల్లో తమకు సందేశం పంపిస్తే రూ.కోటి బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు. సినిమా సక్సెస్ మీట్‌లోనే ఆ మొత్తాన్ని అందిస్తానని, వాట్సాప్ నంబర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో ఈ భారీ ఆఫర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!