
న్యూస్

ఆడవాళ్లకు మద్దతుగా నిలబడటం తన బాధ్యత అని ప్రకాష్ రాజ్ అన్నారు. శివాజీ అయినా, మరెవరైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. శివాజీ క్షమాపణ చెప్పినప్పటికీ, ఆయన వ్యాఖ్యలను చాలామంది అంగీకరించట్లేదన్నారు.
తాను స్పందించిన ప్రతిసారీ కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుంటారని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని, కానీ వాటిని వ్యక్తపరిచే భాష మాత్రం మర్యాదగా ఉండాలని అన్నారు. శివాజీ మాట్లాడిన తీరు పూర్తిగా తప్పేనని స్పష్టం చేశారు.
శివాజీ వేదికపై చెత్తగా మాట్లాడారని విమర్శించారు. మహిళలపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌పై మాట్లాడేటప్పుడు సంస్కారం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. మహిళల శరీర భాగాల గురించి మాట్లాడటం తప్ప వారికి సరైన తెలుగు కూడా రాదని ఘాటుగా విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!