

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక పవర్ఫుల్ కాప్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా పెద్ద సెట్లు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ గెటప్ పూర్తిగా కొత్తగా ఉండబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంట్రీ సీక్వెన్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్‌తో పాటు దాదాపు 200 మంది ఫైటర్స్ కనిపించనున్నారని టాక్. సినిమా మొత్తంలోనే ఈ సన్నివేశం ప్రధాన హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సంగీత విషయానికి వస్తే, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. ‘స్పిరిట్’ కథాంశం కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతుందని, సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న చిత్రం రానుందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!