

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచారు! ఇటీవల జన్మదినాన్ని జరుపుకున్న ప్రభాస్ తన అభిమానులకు ఒకేసారి రెండు సర్ప్రైజ్లు ఇచ్చారు — ఒకటి కొత్త లుక్, మరొకటి భారీ సినిమాల అప్డేట్స్.అందులో ప్రధానంగా నిలిచినది బాహుబలి: ది ఎపిక్. ఇది బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపి రూపొందించిన ప్రత్యేక వెర్షన్. ఈ అద్భుత గాథను మళ్లీ పెద్ద తెరపై చూడటానికి అవకాశం దొరకనుంది 2025 అక్టోబర్ 31న, ప్రపంచవ్యాప్తంగా మల్టీ లాంగ్వేజ్ మరియు ప్రీమియం ఫార్మాట్స్‌లో విడుదల కానుంది.ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఓ కొత్త లుక్‌తో కనిపించారు. గాగుల్స్, హెడ్గియర్లను పక్కనపెట్టి, సింపుల్‌గా కానీ స్టైలిష్‌గా మెరిసిన ఆయన లుక్ వైరల్ అవుతోంది. అభిమానులు “ఈ లుక్ చాలా క్లాసీగా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ది రాజా సాబ్ – రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. మొదటి సాంగ్ నవంబర్ 5న విడుదల అవుతుందని, ట్రైలర్ రిలీజ్ విడుదల సమయానికి సమీపంలో ఉంటుందని సమాచారం.కొత్త లుక్, భారీ సినిమాలతో ప్రభాస్ మళ్లీ ఫ్యాన్స్ హృదయాల్లో రాజుగా వెలుగుతానని చెప్పకనే చెబుతున్నారు!











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!