
గాసిప్స్

టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సమయంలో ఆయనకు గాయం అయినట్లు సమాచారం. ఒక సీన్ కోసం హార్స్ రైడింగ్ చేస్తుండగా ఆయన కిందపడిపోయారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రభాస్ చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. గాయాలు పెద్దవి కాకపోవడంతో వైద్యులు ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రభాస్ త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్పిరిట్’ కంటే ముందే ‘ఫౌజీ’ విడుదల కావడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!