

జపాన్‌లో జరిగిన బాహుబలి: ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యేందుకు ప్రభాస్ అక్కడికి చేరుకున్నారు. జపాన్ లో సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్ వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ఇప్పటివరకు ప్రభాస్ తన స్పిరిట్ మూవీ లుక్ బయటకు రాకుండా ఉండటానికి ఈవెంట్లకు దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి. జపాన్ ఈవెంట్ లో ప్రభాస్ బ్లాక్ క్లాత్ లేకుండా రావడం ఫ్యాన్స్‌కు నిజంగానే హ్యాపీ మోమెంట్ అయ్యింది. ఎక్కువ కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా లీన్ లుక్ లో చూడటం ఫ్యాన్స్ కు చాలా హ్యాపీగా అనిపించింది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన హీరోల స్క్రీన్ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండటంతో, ఆయన లుక్ మరింత స్టైలిష్‌గా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక తరువాత విడుదలయ్యే చిత్రం ది రాజా సాబ్, అలాగే ఆయన ప్రస్తుతం ఫౌజీ మూవీ షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. రాబోయే నెలల్లో ప్రభాస్ అభిమానులకు వరుసగా మంచి అప్డేట్లు రానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!