
క్రీడలు

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్‌ను నిరూపించారు. ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో ఆయన వరుసగా నాలుగోసారి నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రేక్షకుల ఇంట్రెస్ట్, సోషల్ మీడియా ట్రెండ్స్, డిజిటల్ ఎంగేజ్మెంట్ వంటి అంశాల ఆధారంగా రూపొందించే ఈ ర్యాంకింగ్స్‌లో ప్రభాస్ ఆధిపత్యం కొనసాగడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ జాబితాలో టాలీవుడ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలవగా, మహేష్ బాబు ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే రామ్ చరణ్ ఏడో స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ టాప్-10లో చోటు సంపాదించడం విశేషంగా మారింది. టాప్-10లో టాలీవుడ్ స్టార్ల ఆధిపత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!