
గాసిప్స్

ఎన్నో రోజుల ఎదురుచూపుల అనంతరం ఎట్టకేలకు ప్రభాస్ జపాన్ కు చేరుకున్నారు. ఆయన రాగానే అక్కడి అభిమానులు భారీగా చేరి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. పోస్టర్లు, గిఫ్ట్‌లు, నినాదాలతో ప్రభాస్ పేరు మారుమోగింది. బాహుబలి తర్వాత జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో ఈ స్వాగతమే చెబుతోంది. ప్రభాస్ రాకతో అక్కడి అభిమానుల ప్రేమ, ఉత్సాహం మరింత పెరిగింది.
త్వరలో విడుదల కానున్న ‘బాహుబలి: ది ఎపిక్’కి ముందు, ప్రభాస్ ప్రత్యేక ఫ్యాన్ ఇంటరాక్షన్‌కు సిద్ధమవుతున్నారు. అభిమానులు ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రభాస్ జపాన్ ట్రిప్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తగ్గేదేలే అని మరోసారి స్పష్టమైంది.





.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!