

టాలీవుడ్ సీనియర్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోసాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ముఖ్యంగా రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటానని తెలిపారు.
అలాగే ‘నాయక్’ సినిమా సమయంలో జరిగిన విషయాన్ని కూడా పోసాని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఎప్పుడూ అసౌకర్యంగా ఫీలవలేదని చెప్పారు. ఒకసారి చిరంజీవి సినిమా చూసి, పోసాని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ఒక్క సీన్ కూడా తొలగించొద్దని చెప్పారని చరణ్ తనతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. నటుడిని అంతగా గౌరవించే వ్యక్తి చరణ్ అని, అందుకే ‘పెద్ది’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని పోసాని అన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!