

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా పేరుగాంచిన శ్రీ విష్ణు నటించిన హిలేరియస్ జాయ్‌రైడ్ విష్ణు విన్యాసం ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది.
విలేకరుల సమావేశంలో నయన్ సారిక తన పాత్ర గురించి మాట్లాడుతూ, సినిమాలో “మనీషా” అనే డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తానన్నారు. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని, మొదట కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌గా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో ఆమె ప్రవర్తనకు కారణం తెలిసి ప్రేక్షకులు ఆ క్యారెక్టర్‌ను అర్థం చేసుకుని ఇష్టపడతారని చెప్పారు. సినిమాలో ఇద్దరు కాలేజ్ లెక్చరర్స్ మధ్య ప్రేమ కథ ఉండటంతో యూత్, స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అవుతారని తెలిపారు.
శ్రీ విష్ణుతో పనిచేయడం చాలా ఫన్‌గా అనిపించిందని, ఆయన కామెడీ టైమింగ్ నేచురల్‌గా ఉంటుందని నయన్ పేర్కొన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే సినిమా నచ్చిందని, తన పాత్ర కోసం మంచి గైడెన్స్ ఇచ్చారని చెప్పారు. సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన బ్రేకప్ సాంగ్, “మొదలే మొదలే” పాట తనకు చాలా ఇష్టమని తెలిపారు. చిన్నప్పటి నుంచి కలలుగన్న ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ప్రత్యేక అనుభూతి అని, భవిష్యత్తులో రాజమౌళి సినిమాలో నటించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!