
రాజకీయాలు

బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ, దర్శకుడు బుచ్చిబాబు సానాపై ప్రశంసలు కురిపించారు. పెద్ది సినిమాలోని “క్రాస్ ఓవర్ అథ్లెట్” డైలాగ్ కోసం దర్శకుడు ఏకంగా 78 టేక్స్ తీసుకున్నారని తెలిపారు. చిన్న వయసులోనే బుచ్చిబాబుకు గొప్ప విజన్ ఉందని, అనుకున్న ఫలితం వచ్చే వరకు కష్టపడతారని అన్నారు.
హీరో రామ్ చరణ్ కూడా సహనటుడు దివ్యేందు శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మిర్జాపూర్’ పాత్రను గుర్తుచేస్తూ, ఆయన ఆఫ్‌స్క్రీన్‌లో జెంటిల్‌మ్యాన్ అని సరదాగా వ్యాఖ్యానించారు. క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!