

మే 22న విడుదలైన ‘పురుష:’ చిత్రం మంచి మౌత్ టాక్‌తో ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. హీరో పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ, సినిమాను ఆదరించిన ప్రేక్షకులు మరియు మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రముఖ నటనా గురువు సత్యానంద్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నానని, దర్శకుడు వీరు వులవల తనలోని నటుడిని వెలికి తీసేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.
నిర్మాత బత్తుల కోటేశ్వరరావు, దర్శకుడు వీరు వులవల చిత్ర విజయంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ప్రేక్షకుల ఆదరణతో సినిమా మరింత ముందుకు వెళ్తోందని, ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని చిత్రబృందం కోరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!