
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని ఆయన స్వయంగా వెల్లడించారు. భుజానికి సంబంధించిన చిన్న రంధ్ర శస్త్రచికిత్స మాత్రమే చేయించుకున్నానని, అది కూడా ముందస్తు జాగ్రత్తగా నిర్వహించిన సాధారణ చికిత్సేనని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని, క్రమంగా తన దైనందిన కార్యక్రమాల్లోకి తిరిగి వస్తున్నానని చెప్పారు.
ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నితిన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఆయన తదుపరి చిత్రం విశ్వంభరలో కనిపించనుండగా, దర్శకుడు బాబీతో మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!