

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు అన్ని భాషల్లోనూ అద్భుత స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 6.4 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమా గ్లింప్స్‌కు ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రాలేదని చిత్రబృందం వెల్లడించింది. దీంతో ‘డ్రాగన్’ గ్లింప్స్ భారతీయ సినీ ప్రమోషన్స్ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.
గ్లింప్స్‌లోని పవర్ఫుల్ విజువల్స్, ఎన్టీఆర్ ఘాటైన స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ స్టైల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు జరుపుకుంటూ రికార్డు వ్యూస్‌ను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై తాజా రికార్డు మరింత ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!