
జనరల్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ నెల 19, 2026 అర్ధరాత్రి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక గిఫ్ట్‌ను అభిమానులకు అందించనున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ నీల్ సృష్టించిన యాక్షన్ ప్రపంచాన్ని ఫస్ట్ గ్లింప్స్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!