
గాసిప్స్

రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఫన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచే ధోరణి ఉన్నప్పటికీ, ఈ సినిమా టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ అయినప్పటికీ టికెట్ ధరలు పెంచకుండా, సాధారణ ధరలకే సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రెస్ మీట్లో తెలిపారు. ఈ నిర్ణయం సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో సత్య, సునీల్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!