

వినూత్న కథలతో పాటు సహజమైన కామెడీతో ప్రేక్షకులను అలరించే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, తన తాజా చిత్రం విష్ణు విన్యాసం ద్వారా మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. తొలి దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ అనిమేటెడ్ వీడియో రూపంలో విడుదలై, నగర నేపథ్యంతో కూడిన సరదా ప్రపంచాన్ని పరిచయం చేసింది.
నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు రధన్, ఆర్ట్ డైరెక్టర్ ఏ. రామాంజనేయులు, ఎడిటర్ కార్తికేయన్ రోహిణి ఈ చిత్రానికి సాంకేతిక బలం అందిస్తున్నారు. ఇప్పటికే టాకీ భాగం పూర్తవగా, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. విష్ణు విన్యాసం ఫిబ్రవరి 2026 లో థియేటర్లలో విడుదల కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!