
టెక్నాలజీ

కథానాయిక నివేదా పేతురాజ్ ఈ ఏడాది ఆగస్టు నెలలో రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచిన ఆమె తరువాత సోషల్ మీడియాలో వెల్లడించింది. దుబాయ్‌లో స్థిరపడిన మలయాళీ బిజినెస్ మ్యాన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకున్న నివేద ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుంటుందని అందరూ భావించారు. సినిమా వర్గాల్లో కూడా ఇదే చర్చ నడిచింది.
అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నివేదా పేతురాజ్ వివాహం రద్దు అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే క్రికెటర్ స్మృతి మందాన చివరి నిమిషంలో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్టుగానే, నివేద విషయంలో కూడా పరిస్థితులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు, సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!