

టాలీవుడ్లో మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు! ‘జై లవకుశ’, ‘జెంటిల్మెన్’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నివేదా థామస్ సోదరుడు నిఖిల్ థామస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన మొదటి సినిమాకు బెంగళూరు మహానగరంలో బాలకుడు అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మహి - రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం బెంగళూరు నేపథ్యంలో సాగుతుంది. పోస్టర్లో పవన్ కల్యాణ్ ‘పంజా’ లుక్, సత్యం కంప్యూటర్స్, ‘కొలవెరి డి’ పాట లాంటి రిఫరెన్స్‌లు ఉండటంతో ఒకప్పటి కాలాన్ని గుర్తుచేసే కథ అనిపిస్తోంది. సయా క్రియేషన్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అఖిల్ యమ్మనగారి, ఎంఎస్ఎన్ మూర్తి, సీహెచ్‌వీ శర్మ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది.
టెక్నికల్ టీమ్ కూడా చాలా బలంగా ఉంది. ఇటీవల ‘మ్యాడ్’, ‘జాతిరత్నాలు’ వంటి హిట్స్ రాసిన ప్రవీణ్ పట్టు స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ అందిస్తున్నారు. విశ్వదీప్ సంగీతం, మల్లు నాయక్ సినిమాటోగ్రఫీ. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని నిర్మాతలు తెలిపారు.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!