

కొంతకాలం క్రితం మెగా డాటర్ నిహారిక మరియు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై నిహారిక స్పష్టత ఇచ్చింది. ఆమె నిర్మించిన ‘రాకాస’ చిత్రం వచ్చే నెల 3న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆమె స్పందించింది. గతంలో తమ ఇద్దరి పెళ్లి గురించి వచ్చిన వార్తలు పూర్తిగా పుకార్లేనని తెలిపింది.
అదే సమయంలో, తాము ఒక సినిమా ఈవెంట్లో కలిసిన సందర్భం ఈ రూమర్స్ మరింత వైరల్ కావడానికి కారణమైందని నిహారిక వెల్లడించింది. ఆ పరిస్థితిలో విజయ్ దేవరకొండ స్వయంగా స్పందించి, నిహారిక తనకు చెల్లెలు లాంటిదని క్లారిటీ ఇచ్చారని ఆమె చెప్పింది. అలాగే ‘గీత గోవిందం’ సినిమాలో నాగబాబు తనకు తండ్రి పాత్రలో నటించినందువల్ల, నిహారికను చెల్లెలుగా భావిస్తానని విజయ్ అప్పట్లో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది.
ఇక నిహారిక నిర్మించిన ‘రాకాస’ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా, నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!