
గాసిప్స్

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ ఎంటర్టైనర్ మూవీ “లవ్ జాతర” టీమ్ న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసింది. యూజీ క్రియేషన్స్ బ్యానర్‌పై, “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో, కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది.
కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్టైనర్గా “లవ్ జాతర” తెరకెక్కుతోంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ న్యూ ఇయర్లో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ విడుదల కానున్నాయని చిత్ర బృందం తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!