

న్యూ ఇయర్‌తో పాటు హీరో శ్రీ స్కంద పుట్టినరోజు సందర్భంగా ‘మన డాక్టర్ బాబే’ చిత్ర బృందం అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై శరణ్య, సుదీక్ష సమర్పణలో కృతాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. గ్లింప్స్‌లో శ్రీ స్కంద గ్రామీణ నేపథ్యంలోని డాక్టర్ పాత్రలో కనిపిస్తూ, సహజమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్, పచ్చని ప్రకృతి, ఊరి క్లినిక్ వాతావరణంతో ‘మన డాక్టర్ బాబే’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్నట్లు గ్లింప్స్ స్పష్టంగా చెబుతోంది. ఈ చిత్రంలో మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, అలీ, శాంతి శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ బుసం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!