

యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలపై యశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. హాలీవుడ్ తరహా విడుదల విధానాన్ని అనుసరిస్తున్నామని, ఇది సాధారణ భారతీయ సినిమా రిలీజ్ పద్ధతులకు భిన్నంగా ఉండవచ్చని తెలిపారు. కానీ ఈ నిర్ణయం పూర్తిగా అభిమానుల కోసం తీసుకున్నదేనని చెప్పారు.
హాలీవుడ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యశ్, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ముందుగా సినిమా పూర్తిగా ఫినిష్ చేసి ఆ తర్వాతే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం అభిమానులకు మొదట్లో నచ్చకపోవచ్చని కూడా అన్నారు. ముందుగా మార్చి 19 న, తరువాత వచ్చే నెల 4 న విడుదల చేయాలని భావించిన ఈ సినిమా, గ్లోబల్ రిలీజ్ లక్ష్యంతో మళ్లీ వాయిదా పడినట్లు ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!