

సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంక్రాంతి విన్నర్‌గా రన్ అవుతోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా నటించగా, సంయుక్త మరియు సాక్షి వైద్య కథానాయికలుగా మెప్పించారు. శ్రీ విష్ణు చేసిన కామియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, హౌస్ ఫుల్ షోలతో సినిమా మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘన విజయం సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. శర్వా మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమే ఈ విజయానికి కారణమని తెలిపారు. నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ్ అబ్బరాజు సహా పలువురు సినీ ప్రముఖులు సినిమా యూనిట్‌ను అభినందించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!