
జనరల్

అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడిగా జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో సీనియర్ నటుడు నరేష్ ‘స్వతంత్ర బాబాయ్’ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర వినోదంతో పాటు బోల్డ్ నేచర్‌లో ఉండనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తిరుపతి నేపథ్యంతో సాగనుంది. తిరుమల క్షేత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక సంఘటన ఆధారంగా కథ రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే కథ, పాత్రలపై ఆసక్తి పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!