
బిజినెస్

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మమత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయనున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!