

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ది ప్యారడైస్ కు శ్రీకాంత్ ఒడెల దర్శకత్వం వహిస్తున్నారు. దసరా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26 న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విడుదల వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తవగా, మిగతా భాగం పూర్తి కావడానికి మరో 50 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో జూన్ 2026లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పురోగతిపై వస్తున్న వార్తలకు మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!