
రాజకీయాలు

తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీలీల టాలీవుడ్లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. వరుస బ్లాక్బస్టర్లు లేకపోయినా, గ్లామర్‌తో పాటు అద్భుతమైన డాన్స్ ప్రతిభతో అవకాశాలను అందుకుంటోంది. అయితే కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ఆమెపై ‘ఐరన్ లెగ్’ అనే విమర్శలు కూడా వచ్చాయి.
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ చిత్రంలో మొదట శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని తెలిపారు. ఇటీవల సినిమా చూసిన తర్వాత, ఆ పాత్ర భాగ్యశ్రీకు సరిగ్గా సరిపోయిందని ఆయన పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!