

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో సంపూర్ణ వినోదాన్ని అందించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా పండుగ సీజన్‌కు సరిపోయే ఎంటర్టైనర్గా నిలవనుంది.
టీజర్లో శర్వానంద్ గతం – వర్తమాన ప్రేమల మధ్య ఇరుక్కున్న పాత్రలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుత ప్రేమగా సాక్షి వైద్య, మాజీ ప్రేయసిగా సంయుక్త నటించగా, నరేష్, సత్య, సునీల్, సుదర్శన్ లు హాస్యాన్ని మరింత పెంచారు. సి.ఎమ్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ సినిమా పొట్టపగిలి నవ్వేలా ఉంటుందని తెలిపారు. నారి నారి నడుమ మురారి సినిమా జనవరి 14 న సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల కానుంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!