
క్రీడలు

మూడు దశాబ్దాలుగా పలు భాషల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు ద్వారా ఆయన డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఆయన కుక్కుటేశ్వరరావు అనే క్రమశిక్షణ గల తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
తన కుమారుడు సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మారాలని నిర్ణయించుకోవడంతో కుటుంబంలో భావోద్వేగాలు, అభిప్రాయ భేదాలు ఎలా మారతాయనే కథ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. మాకిపూర్ గ్రామ నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్‌లో హాస్యం, కుటుంబ బంధాలు, సామాజిక అంశాలు కలగలిసాయి. హాస్యం ద్వారా ఆలోచింపజేసే కథ ఇదని మురళీ శర్మ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!