
రాజకీయాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, కొంతమంది వ్యక్తులు MAA పేరును దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించింది. “AP MAA”, “MAA AP” వంటి పేర్లతో కళాకారులను తప్పుదారి పట్టిస్తూ చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
ఈ సంస్థలను MAA అధికారికంగా గుర్తించలేదని స్పష్టం చేసిన అసోసియేషన్, తమ తరపున డబ్బులు వసూలు చేయడానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ మోసపూరిత కార్యకలాపాలను తీవ్రంగా ఖండించిన MAA, కళాకారులు ఇలాంటి నకిలీ సంఘాల్లో సభ్యత్వం తీసుకోకూడదని, ఎటువంటి చెల్లింపులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!