

మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న భారీ స్థాయి చిత్రం ‘వృషభ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విజువల్‌గా గ్రాండ్‌గా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తీసుకొస్తుండగా, ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
‘వృషభ’ను కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ సహా పలువురు నిర్మాతలు నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో దర్శకుడు నందకిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ట్రైలర్ కథనాన్ని పరిశీలిస్తే, ఆదిదేవ వర్మ అనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త పాత్రలో మోహన్‌లాల్ కనిపిస్తారు. వ్యాపార రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న ఈ వ్యక్తి అనేక శత్రువులను ఎదుర్కొంటూ మానసిక సంఘర్షణకు లోనవుతుంటాడు. అదే సమయంలో అతడికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆ జ్ఞాపకాల్లో రాజా విజయేంద్ర వృషభ అనే అసమాన యోధుడిగా ప్రజల్ని, సామ్రాజ్యాన్ని రక్షించే పాత్రలోనూ మోహన్‌లాల్ దర్శనమిస్తారు.
తండ్రిని రక్షించేందుకు అతని కుమారుడు సైకియాట్రిస్టుల సహాయం తీసుకోవడం, శత్రువుల నుంచి కాపాడే ప్రయత్నాలు చేయడం కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి. గతం – వర్తమానం మధ్య కథ ఎలా ముడిపడిందన్న అంశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. హై టెక్నికల్ వాల్యూస్, భారీ కాస్టింగ్, అద్భుతమైన విజువల్స్‌తో ‘వృషభ’ ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుందన్న సంకేతాన్ని ట్రైలర్ ఇస్తోంది.
మోహన్‌లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయ్యప్ప పి. శర్మ, కిషోర్ తదితరులు
ఎడిటింగ్: కేఎం ప్రకాష్
సినిమాటోగ్రఫీ: ఆంటోనీ సామ్సన్
స్టంట్స్: పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
డైలాగ్స్: ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్
మ్యూజిక్: సామ్ సీఎస్, అరియన్ మెహెదీ
డైరెక్టర్: నందకిషోర్











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!