

టాలీవుడ్ థియేటర్లలో డ్రై సీజన్ కొనసాగుతున్న సమయంలో పెద్ది ట్రైలర్, డ్రాగన్ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలను బట్టి చూస్తే ఈ రెండు వీడియోలపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను బుచ్చిబాబు సనా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేసినప్పటికీ, ట్రైలర్ మాత్రం కొంత భిన్నమైన టోన్‌లో కనిపించింది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ గ్లింప్స్ సినిమాలోని ప్రపంచాన్ని, స్కేల్‌ను బలంగా చూపించినా అభిమానులు ఆశించిన యాక్షన్ ఎలివేషన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెద్ది టీమ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్, కొత్త పాటల విడుదలలతో మరింత హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తుండగా, డ్రాగన్ విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ప్రమోషన్స్‌ను మరింత బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!