
న్యూస్

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా తన సీక్రెట్ పెళ్లి గురించి తప్పుడు కథనాలు ప్రచురించిన ఒక మీడియా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇలాంటి పుకార్లను పట్టించుకోకుండా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం స్పందించక తప్పలేదని ఆమె తెలిపారు. తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాసిన వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వివరంగా పోస్ట్ చేసిన మెహరీన్, ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని, తన వికీపీడియా పేజీని హ్యాక్ చేసి రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇలాంటి నీచ చర్యలు చేశారని ఆరోపించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తానే ప్రపంచానికి ప్రకటిస్తానని వాగ్దానం చేసిన ఆమె, డబ్బు తీసుకుని తప్పుడు కథనాలు రాయడం జర్నలిజాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!