
జనరల్

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించారు. జూలై 1న ఈ వివాహ వేడుక జరగనుంది.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కొన్ని పాత ఫొటోలను పంచుకున్న మెహర్ రమేష్, తన పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. కాలం మారినా, బాధ్యతలు పెరిగినా తమ మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం మాత్రం ఏమాత్రం మారలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!