

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కోనిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన గారు ప్రజెంట్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘సాసిరేఖ’ కూడా అదిరిపోయింది.
భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో వచ్చిన ఈ పాట చాలా మధురంగా, డాన్స్ నంబర్‌గా మారింది. చిరంజీవి తనని పేదవాడిగా చెప్పుకుంటే, నయనతార ప్రేమలో అన్నీ దాటిపోతాయని రొమాంటిక్‌గా రిప్లై ఇస్తుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్, భీమ్స్-మధు ప్రియ సింగింగ్ పాటను ఇంకా ఎలివేట్ చేశాయి.
భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం చిరంజీవి-నయనతార జంట కెమిస్ట్రీ, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్ చూస్తే కళ్లు చెదిరేలా ఉన్నాయి. ట్రెడిషనల్ & ట్రెండీ లుక్స్‌లో చిరు స్టైల్ కిల్లర్ ఎగ్జాటిక్ లొకేషన్స్‌లో ఈ పాటకు మరింత అందం జోడించాయి.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక విభాగం:
కథ & దర్శకత్వం – అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి, సుష్మిత కోనిదెల
బ్యానర్స్ – షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
ప్రజెంటర్ – శ్రీమతి అర్చన గారు
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
కెమెరా – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటింగ్ – తమ్మిరాజు
కథారచన – ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. కృష్ణ
వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
అదనపు మాటలు – అజ్జ్జు మహాకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
పీఆర్ఓ – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – హ్యాష్‌ట్యాగ్ మీడియా.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!