

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తికాగా, దానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసి మేకర్స్ అభిమానులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!