

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ మీద అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇప్పుడు మరింత బలం చేకూరింది. సంగీత మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించడానికి అధికారికంగా జాయిన్ కావడం సినిమాపై క్రేజ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పటికే రామ్ చరణ్ ‘పెద్ది’ తర్వాత మరోసారి మెగాస్టార్ ప్రాజెక్ట్‌తో రెహమాన్ కలవడం విశేషంగా మారింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తున్న బ్లేడ్, రక్తపు చారలు ఈ సినిమాకు హార్డ్‌కోర్ యాక్షన్ టోన్ ఉంటుందని స్పష్టంగా సూచిస్తున్నాయి. కథ, క్యారెక్టర్, మ్యూజిక్ – ఈ మూడు అంశాలు కలిసి ‘మెగా 158’ ను ఒక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టనున్నాయనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఏర్పడింది. త్వరలో మరిన్ని అప్డేట్స్తో ఈ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!