

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా పెడ్డి నుండి హీరోయిన్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర పేరు అచ్చియమ్మ. ఆమెను దర్శకుడు దైర్యసాహసాలకి ప్రతీకగా చూపించారు.
ఒక పోస్టర్లో జాన్వీ సాంప్రదాయ సారీ కట్టులో స్టేజి మీద మైక్ ముందు కఠిన చూపుతో నిలబడి కనిపిస్తే, మరో పోస్టర్లో జీప్ మీద నిలబడి ప్రజలకు చేతులు ఊపుతూ కనిపిస్తోంది. ఈ రెండు పోస్టర్లు ఆమె పాత్రలోని ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని బలంగా చూపిస్తున్నాయి.
ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా, ఈ సినిమాకి ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ రాశారని సమాచారం.
ఇటీవల శివరాజ్ కుమార్ పాత్ర లుక్ ను కూడా విడుదల చేశారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ సినిమా మార్చ్ 27, 2026, అంటే రామ్ చరణ్ బర్త్డే నాడు థియేటర్లలో విడుదల కానుంది.

_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!