

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి సృజనాత్మక సాహసానికి సిద్ధమయ్యాడు. సందీప్ కాకరాల నిర్మాణంలో తారక్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న #CULT చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణం అన్నింటినీ విశ్వక్ సేన్ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇండియాలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో విశ్వక్ సేన్ స్టైలిష్ సూట్లో సిగరెట్‌తో ముందుకు నడుస్తూ, చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి పట్టుకుని కనిపించడం పోస్టర్‌కు భయానక, బోల్డ్ టోన్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 21 న విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజెడ్‌వై, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చెపూరి వివేక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఈ చిత్రం భారీ లాంచ్‌ప్యాడ్‌గా నిలవనుంది. తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవి తేజ గిరిజాల ఎడిటింగ్‌తో #CULT చిత్రం తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!