
సినిమాలు

‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట వివాదాస్పదం కావడంపై గాయని మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ పాటను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించినట్లు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎవరి భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని ఆమె స్పష్టం చేశారు.
కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’లోని ఈ పాటపై హిందీ వర్షన్‌కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో లిరిక్స్‌లో మార్పులు చేసినట్లు మంగ్లీ తెలిపారు. సవరించిన పాటను త్వరలో విడుదల చేస్తామని, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!