

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్‌గారు. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి చేత చాలా గ్రాండ్‌గా రూపొందుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమాతో అనిల్ రావిపూడి, చిరంజీవికి మరో హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కథను కూడా ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా రూపొందించినట్లు సమాచారం. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, నయనతార హీరోయిన్గా కనిపించనున్నారు. అంతేకాదు, గెస్ట్ రోల్లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. ఒక సాంగ్‌లో మరియు దాదాపు 20 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉంటుంది అని టాక్ ఉంది.
ఈ పాత్రను సినిమాకు తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. చిరు స్వయంగా వెంకటేష్‌ను ఒప్పించి, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఇటీవలే వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా, అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌తో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
మెగాస్టార్ – అనిల్ రావిపూడి కాంబో అంటే హిట్ గ్యారంటీ!