

మాస్ మహారాజా రవి తేజ తన 77వ చిత్రంగా దర్శకుడు శివ నిర్వాణతో కలిసి నటిస్తున్న చిత్రం #RT77. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవి తేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్‌ను ఇరుముడిగా ప్రకటిస్తూ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. కొత్త కాంబినేషన్‌తో పాటు ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయ్యప్ప స్వామికి భక్తులు సమర్పించే పవిత్ర నైవేద్యాన్ని సూచించే ‘ఇరుముడి’ టైటిల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఫస్ట్ లుక్‌లో రవి తేజ అయ్యప్ప మాల ధారణలో దర్శనమిస్తూ భక్తుల ఊరేగింపులో ఉత్సాహభరితంగా కనిపించారు. చేతుల్లో చిన్నారిని ఎత్తుకుని కనిపించడం తండ్రి–కూతురు బంధాన్ని సూచిస్తూ భావోద్వేగాన్ని పెంచుతోంది. హీరోయిన్గా ప్రియ భవానీ శంకర్ నటిస్తుండగా, రవి తేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!