
టెక్నాలజీ

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “వారణాసి” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌కు విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుత స్పందన వచ్చినా, ఆ తర్వాత పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
అంతర్జాతీయ స్థాయిలో బహుభాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ విజువల్స్, పౌరాణిక అంశాలతో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!